అర్హులకే అక్రిడిడేషన్ ఇవ్వండి..కలెక్టర్ కు వినతి

by Disha Web Desk 11 |
అర్హులకే అక్రిడిడేషన్ ఇవ్వండి..కలెక్టర్ కు వినతి
X

దిశ, నేరేడుచర్ల: అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిడేషన్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజూర్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు రావుల రాజు మాట్లాడుతూ హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతి పొందేలా చూడాలన్నారు. అక్రిడిడేషన్ తో సంబంధం లేకుండా పనిచేసే ప్రతి జర్నలిస్టుకి కూడా ఇండ్ల స్థలం కేటాయించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రజాప్రతినిధులుగా వివిధ పార్టీలో నాయకులుగా కొనసాగుతూ అక్రిడిడేషన్ పొందిన వారిని గుర్తించి అక్రిడిడేషన్ రద్దు చేయాలని కోరుతూ వినతిప్రతంలో పేర్కొన్నట్లు తెలిపారు. అధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు వారధిగా ఉన్నారని కానీ జర్నలిస్టుల సమస్యలు పట్టించుకునే వారే లేరని వాపోయారు. జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వారధిగా ఉండాలని కలెక్టర్ ను కోరామని ఆయన తెలిపారు. దానికి సమాధానంగా కలెక్టర్ తన వంతు కృషి చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ముళ్ళ. నగేష్, బుడిగే శంకర్, సట్టు. శీను, జగదీష్, అశోక్ రవీందర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story