అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ.. NFHS సర్వేలో వెల్లడి

by  |
Love Affair
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత్‌‌లో ఎప్పుడూ లేని విధంగా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. బుధవారం 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలను కేంద్రం ప్రకటించింది. 1992లో మొదలైన ఈ సర్వే మొట్ట మొదటిసారిగా స్త్రీల నిష్పత్తి పురుషులను మించిపోయింది. 2015-16లో విడుదల అయిన 4వ సర్వే ఫలితాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 991 మంది మహిళలు ఉన్నారు. గడిచిన ఐదేళ్లలో మహిళల సంఖ్య పెరిగి 1,000 మంది పురుషులకు 1,020 మంది మహిళలు ఉన్నారు.

అయితే, దేశంలో స్త్రీ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం కేరళగా గుర్తించారు. కేరళలో వెయ్యి మంది పురుషులకు 1,121 మంది మహిళలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. చివరగా పురుషుల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలియజేస్తోంది. ఐదేళ్లలో పుట్టిన పిల్లల లింగ నిష్పత్తిలో 1,000 మంది పురుషులకు 951కి తగ్గింది.

Next Story