పాతబస్తీలో ఏసీబీ దాడులు.. ఆ అధికారి ఇళ్లే టార్గెట్!

90

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్‌లోని ఫలక్‌నామా సర్కిల్ సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ముసారాంబాగ్ క్రాంతి కుమార్ తన తల్లి మరణించడంతో జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ.20 వేల దహన సంస్కార ఖర్చులు మంజూరు చేయాలని అధికారులను కోరాడు. దీంతో సూపరింటెండెంట్ పూల్ సింగ్ రూ.5 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో లంచం తీసుకుంటుండుగా సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యెండెడ్‌గా పట్టుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..