టాక్స్ పేయర్స్‌కు బల్దియా గుడ్‌న్యూస్@ 90% ఆఫ్

91
GHMC

దిశ, తెలంగాణ బ్యూరో : పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ మరోసారి ఆఫర్ ప్రకటించింది. 2020 -21 ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లింపుదారులు ఈ నెల 31 లోపు చెల్లిస్తే 90 శాతం వడ్డి మినహాయింపునివ్వనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2020 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు 45 రోజుల పాటు వన్ టైం స్కీం (ఓటీఎస్)ను జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేశారు.

ఆ తర్వాత నవంబర్ 15 వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది డిసెంబర్ 28న రాసిన లేఖకు స్పందిస్తూ ఓటీఎస్‌ను మరోసారి అమలు చేసేందుకు ఎంఏయూడీ అంగీకరించింది. దీంతో ఈ నెల 31 వరకూ అమల్లో ఉంటుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..