కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సినేషన్

by  |
కార్మికులు, జర్నలిస్టులు, ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సినేషన్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఓ వైపు ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. ఇక పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చెందిన గాంధీ ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఉచిత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు.

జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు, ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మేయర్ కోరారు. మొదటి విడత వ్యాక్సిన్‌తో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని ఆమె సూచించారు. జీహెచ్ఎంసీ కార్మికులందరికీ సైతం వ్యాక్సిన్ ఇప్పిస్తామని మేయర్ స్పష్టంచేశారు.Next Story

Most Viewed