ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ‘గని’ సాంగ్..

147
Ghani First Song

దిశ, సినిమా: కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’.. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా గని ‘యాంథెమ్’ రిలీజ్ చేశారు మేకర్స్. ‘విజయం సాధించే వరకూ నీ ప్రయత్నం కొనసాగాలి’ అంటూ స్ఫూర్తి నింపే ఈ సాంగ్.. ‘నీ జగజగడం వదలకురా కడవరకూ.. ఈ కదన గుణం అవసరమే ప్రతి కలకు.. నిన్నేంటి మొన్నేంటి నీకెందుకు, ఇవ్వాళే నీకు మైదానం.. పడ్డావో లేచావో నువ్వాగకు, కొనసాగాలి క్రీడా ప్రస్థానం’ లిరిక్స్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, థమన్‌ సంగీతం సమకూర్చగా .. ఆదిత్య అయ్యంగర్‌, సాయిచరణ్‌ భాస్కరుని, పృథ్వీచంద్ర అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ నాయిక కాగా.. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాణ సారథ్యంలో వస్తున్న చిత్రం డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..