గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు

by  |
గ్యాంగ్‌స్టర్‌ అరెస్టు
X

దిశ, క్రైమ్ బ్యూరో : కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన పేరు మోసిన గ్యాంగ్ స్టర్‌ను కర్నాటక పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడ అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉండి గ్యాంగ్ స్టర్‌గా పేరొందిన మార్కెట్ సతీశ్ కొంత కాలంగా నగరంలో తలదాచుకుంటున్నాడు. అయితే, గ్యాంగ్ స్టర్ మార్కెట్ సతీశ్ హైదరాబాద్‌‌లోని సైదాబాద్‌లో నివసిస్తున్నట్టు కర్నాటక పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కర్నాటక పోలీసులు గ్యాంగ్ స్టర్ నివాసంపై మంగళవారం మెరుపుదాడి చేశారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.


Next Story

Most Viewed