దోమకొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గండ్ర మధుసూదన్ రావు

65

దిశ, నిజామాబాద్ సిటీ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గండ్ర మధుసూదన్ రావు ఎంపికయ్యారు. గురువారం కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపిక జరిగింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నరసయ్య కొనసాగారు. ఇక మీదట మండల అధ్యక్షుడిగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు అయిన మధుసూదన్ రావును కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే గంప గోవర్దన్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని ఆయన చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..