కన్నుల పండువగా గణపతి పూజ మహోత్సవం

by  |
కన్నుల పండువగా గణపతి పూజ మహోత్సవం
X

దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ లో కొలువుదీరిన పంచముఖ రుద్ర మహా గణపతి పూజా కార్యక్రమాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. 40 అడుగుల ఎత్తులో గౌరీ తనయుడు కొలువుండగా గణపతికి ఇరువైపులా కృష్ణ కాళీ, కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. జూన్ మాసంలో తొలి ఏకాదశి నాడు కర్ర పూజ తో విగ్రహ ఏర్పాట్ల పనులు ప్రారంభించగా బుధవారం విగ్రహ తయారీ పూర్తయింది. ఉత్సవానికి మూడు రోజుల ముందే విగ్రహాలు పూర్తి కావడంతో భక్తులకు దర్శనానికి అనుమతించారు.

60 అడుగుల జంధ్యం సమర్పణ

ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఏకదంతుని కి 60 అడుగుల జంజం, గరిక మాల, కండువాతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించింది. సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పట్టు వస్త్రాలను రాజ్దూత్ చౌరస్తా నుంచి గుర్రపు బగ్గిలో స్వామి వారి చెంతకు తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, కోలాటం ఒగ్గులు నృత్యాల తో పట్టు వస్త్రాలు గణపతి చెంతకు చేర్చారు. 60 అడుగుల జంధ్యాన్ని ఐపీఎస్ అధికారి విశ్వప్రసాద్ సమర్పించగా, కందువ గరికమాలను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శివానంద సమర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కృష్ణ కాళి, కాల నాగేశ్వరి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్లగొండ అడిషనల్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ముత్యా భిషేకం చేశారు. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వామివారికి 25 కేజీల లడ్డూను సమర్పించారు.

మొదటి పూజ నిర్వహించడం గవర్నర్ తమిళ సై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణనాథుడికి మొదటి పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు భక్త జన సందోహం నడుమ సాగిన ఈ ఈ కార్యక్రమానికి గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయ రెడ్డి లు హాజరయ్యారు. నాథుడు ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ప్రత్యేకంగా పూజించినట్లు గవర్నర్ తమిళ సై తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ కమిటీ గవర్నర్ ను సన్మానించి, గణపతి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు

భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణపతి వద్దకు చేరుకోవడానికి నాలుగు దారులు ఉండగా రెండు ద్వారాల గుండా భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ఖైరతాబాద్ రైల్వే గేటు మీదుగా వచ్చి వారిని భారీ కేట్ల ద్వారా గణపతి చెంతకు పంపించి టెస్ట్ బుక్ ప్రెస్ గుండా బయటికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. లకిడికపూల్ మీదుగా వచ్చే భక్తులు వార్డ్ ఆఫీస్ మీదుగా ఏర్పాటుచేసిన బారికేడ్లను ద్వారా గణపతి చెంతకు చేరుకుంటారు‌. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు లేకుండా అనుమతించబోమని హెచ్చరికలు చేస్తూ ఉండడంతో భక్తులు తగిన జాగ్రత్తలతో గణపతి చెంతకు చేరి దర్శించుకున్నారు.

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

లంబోదరుడు ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు వస్తుండడంతో గణపతి కి నాలుగు వైపులా ఉన్న రహదారులపై సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారి పర్యవేక్షణలో నిత్యం సిసి కెమెరాలు పర్యవేక్షిస్తూ వీధిలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కుమార్ వంద మంది పోలీసులు 150 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు రెండు వందల పైచిలుకు ఎన్ సి సి విద్యార్థులు బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు.

Next Story

Most Viewed