గజ్వేల్ గడ్డ నుంచి డాక్టర్ సాబ్.. ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్

by  |
గజ్వేల్ గడ్డ నుంచి డాక్టర్ సాబ్.. ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్
X

దిశ, గజ్వేల్: మెదక్ నుంచి సీఎం కేసీఆర్ కు ఎంతో నమ్మకస్తుడైన యాదవ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. స్థానిక ఎమ్మెల్సీ కోటాలో తనకు అవకాశం ఇచ్చినట్టు గులాభి బాస్ ప్రకటించాడు. దాంతో ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకున్న యాదవ రెడ్డికి సముచిత స్థానం దక్కిందని గజ్వేల్ గులాభి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ నేపథ్యం..

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విధ్యనభ్యసించిన యాదవరెడ్డి, గజ్వేల్ పట్టణంలో డాక్టర్ వృత్తి చేపట్టి విస్తృత సేవలందించారు. 1978 సంవత్సరం నుండి క్రీయాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. వివిధ ధశల్లో పలు హోదాల్లో పార్టీ పదవులను అలంకరించారు. మాజీ మంత్రి గీతారెడ్డికి నాడు అనుంగ అనుచరుడిగా ప్రత్యేక గుర్తింపు పోందారు. తదనంతరం గజ్వేల్ మాజీ ఎంఎల్ఎ నర్సారెడ్డికి గీతారెడ్డి అధిక ప్రాధన్యత ఇస్తున్నారని తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదనే కారణంతో కాంగ్రెస్ ను వీడి 2014 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తున్న క్రమంలో ఆయన సమక్షంలోనే తెరాస పార్టీలో చేరి నాటి నుండి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రికి గజ్వేల్లో ప్రధాన అనుచరుడిగా కోనసాగుతున్నారు.

గజ్వేల్ మార్కెట్ పై తనదైన ముద్ర..

కాంగ్రెస్ పార్టీలో యాదవరెడ్డికి గజ్వేల్ మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎన్నికయ్యారు. నాటి కాలంలో గజ్వేల్ ఎంఎల్ఎ తర్వాత అంతటి డిమాండ్ కల్గిన పదవిగా మార్కెట్ కమిటి చైర్మన్ గిరికి ఉండేది. 2006 సంవత్సరం నుండి 2010 వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. తన హోదాకు తగిన పదవి కాదని సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా అవకాశం వచ్చినా దాన్ని సున్నితంగా తిరస్కరించారు.

ముఖ్యమంత్రితో డాక్టర్ సాబ్ సాన్నిహిత్యం..

2014 ఎన్నికలకు ముందు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్థానికంగా పార్టీ క్యాడర్ అంతంత మాత్రమే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో క్రీయాశీలకంగా పని చేస్తున్న యాదవ రెడ్డి తెరాసలో చేరడం పార్టీకి బాగానే కలిసోచ్చింది. ఎదురు లేని మెజార్టీతో విజయం సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2018 ఎన్నికల్లోనూ కేసీఆర్ గెలుపుకు విశేషంగా కృషి చేయడంతో యాదవ రెడ్డి ఆయన దృష్టిని ఆకర్షించారు.



Next Story

Most Viewed