లైఫ్ రిస్క్ చేసిన ఆరోగ్య కార్యకర్త.. కేంద్ర మంత్రి ట్వీట్ వైరల్

by  |
లైఫ్ రిస్క్ చేసిన ఆరోగ్య కార్యకర్త.. కేంద్ర మంత్రి ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు మారు మూల గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. పలువురు అయితే ప్రాణాలకు తెగించి ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆరోగ్య కార్యకర్త ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి మీద తాత్కాలికంగా వేసిన కర్రల బ్రిడ్జిపై రిస్క్ చేశాడు.

మెడలో వ్యాక్సినేషన్ కిట్ వేసుకుని కర్రలపై నడుస్తూ.. నది దాటుతూ వచ్చి ప్రజలకు వ్యాక్సిన్ వేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోండగా.. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘ప్రమాదకరమైన నదులను దాటడం నుండి కఠినమైన భూభాగాల గుండా ప్రయాణించడం, మన దేశంలోని నలుమూలలకు చేరుకోవడం వరకు కృషి చేసేది మన ఆరోగ్య కార్యకర్తలే.. LargestVaccineDriveని ధైర్యంతో, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ హర్షం వ్యక్తం చేశారు.

Next Story