రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి ఢిల్లీ హైకోర్టు బ్రేక్!

by  |
Future Retail
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ రిటైల్ ఒప్పందంపై ముందుకు వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ తీర్పును సమర్థిస్తూ..ప్యానెల్ ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగానే ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరిచిన కోర్టు..ఈ ఒప్పందం ముందుకెళ్లకుండా చూడాలని జస్టిస్ జే ఆర్ మిధా ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, తదుపరి విచారణకు బియానీతో పాటు ఆయన కంపెనీ డైరెక్టర్లు ఏప్రిల్ 28న కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. ఫ్యూచర్ గ్రూపునకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా..ఫ్యూచర్ గ్రూప్, దాని డైరెక్టర్లు రూ. 20 లక్షలను బీపీఎల్ కుటుంబాల్లో వయోవృద్ధులకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు గానూ ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అత్యవసర ఆర్బిట్రేషన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలలు జైలులో ఎందుకు పెట్టకూడదో వివరించాలని వెల్లడించింది.


Next Story

Most Viewed