ఈ రాశివారికి ఊహించని మంచి అవకాశాలు .. ఈ రాశి స్త్రీలకు అశాంతి..

by  |
ఈ రాశివారికి ఊహించని మంచి అవకాశాలు .. ఈ రాశి స్త్రీలకు అశాంతి..
X

తేది : 1, అక్టోబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి (నిన్న రాత్రి 10 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 59 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 32 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 56 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 0 ని॥ నుంచి 11 గం॥ 41 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 8 గం॥ 9 ని॥ నుంచి 9 గం॥ 50 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ నుంచి 9 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 29 ని॥ నుంచి 1 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 4 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 5 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 6 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకము

మేష రాశి : స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గందరగోళం, కోపం వదిలివేయండి. దైవ ప్రార్థన వలన సరైన ఆలోచనలు వస్తాయి. ఆఫీసు పనులలో నూతన బాధ్యతల వలన అధిక శ్రమ ఉన్నప్పటికీ అన్ని పనులను త్వరగా పూర్తిచేస్తారు. ఆదాయం బాగున్నప్పటికీ అనవసర దుబారా ఖర్చు వలన డబ్బుకు ఇబ్బంది. అనుకోని అతిథుల రాక వలన మీరు ఖాళీ ఈ సమయంలో చేద్దామనుకున్న పనులు చేయలేరు. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యవహారాల గురించి మీ భర్తతో గొడవలు వస్తాయి జాగ్రత్తపడండి వాటిని పెంచకండి.

వృషభ రాశి : సహోదరుల, స్నేహితుల, బంధువుల సహాకారం లభిస్తుంది. గందరగోళం నిరాశావాద ధోరణి వదిలివేయండి. దైవ బలం వలన అన్ని పనులలో విజయాలు. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. నూతన వస్త్రములు కొనుగోలు చేస్తారు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు, జీతం పెరుగుదల. కొంతమందికి ఉద్యోగంలో మంచి మార్పు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

మిధున రాశి : అనుకున్న కార్యాలను పూర్తి చేయాలంటే పట్టుదల, ఆశావహ దృక్పథం తప్పనిసరి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కొత్త పథకాల లో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు లో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. పనులు పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు కానీ పాత గొడవలు తవ్వకండి.

కర్కాటక రాశి : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నూతన ఆభరణాలు కొంటారు. కుటుంబ విషయాల పరంగా సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో అందరి సలహాలు వినండి సరైన నిర్ణయం మీరే తీసుకోండి. దైవ ప్రార్ధన వలన దైవ బలం తోడవుతుంది పాత బాకీలు తీర్చకుండా అప్పు అడుగుతున్న స్నేహితులను దూరం పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : గందరగోళం, నిరాశావాద ధోరణిని వదిలివేయండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తిచేస్తారు. ఆదాయం కన్నా గొప్ప కోసం చేసిన ఖర్చులు ఎక్కువ అవ్వటం వలన మానసిక అశాంతి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కన్య రాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలంగా కోర్టులో నడుస్తున్న కేసు మీకు అనుకూలం. కావాల్సినంత ధనం చేతికందుతుంది. దానధర్మాలు చేయడం వలన మానసిక ప్రశాంతత మరియు దైవ బలం తోడవుతుంది. ఆఫీసు పనులలో అనుకోని బాధ్యతలు. పనులను పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆర్థిక విషయాలు మరింత పెరుగుతాయి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు పెడతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తకు కూడా కుటుంబ బాధ్యతల పట్ల సమాన బాధ్యత ఉంది అని గుర్తు చేయండి.

తులారాశి : ఆత్మవిశ్వాసమే మీ బలం. ఊహించని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆఫీసు పనులు రొటీన్ అవ్వడం వలన వాటి మీద శ్రద్ధ పెట్టలేరు. ప్రణాళికతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి. కుటుంబ పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది కావలసిన ధనం చేతికి అందుతుంది. పొదుపు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు మీరు కుటుంబ ప్రగతి కోసం చేస్తున్న ప్రయత్నాలను హర్షిస్తారు.

వృశ్చిక రాశి : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఊహలను వదిలి వాస్తవ ప్రపంచం లోకి రండి. కష్టే ఫలి. సహనంతో పరిస్థితులను ఎదుర్కొనండి కుటుంబ సభ్యులతో ఆదాయ వ్యవహారాల గురించి చర్చిస్తారు. ఆఫీసు పనులలో ఒత్తిడి వలన తప్పులు జరగవచ్చు. సరైన ప్రణాళికతో పనులను పూర్తి చేయండి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొరకు ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు మీరు కుటుంబ ప్రగతి కోసం చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటారు.

ధనస్సు రాశి : తొందరపాటు వద్దు. సహనంతో ఆలోచించండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులను సరైన ప్రణాళికతో పూర్తిచేస్తారు కుటుంబ వ్యవహారాలు గురించి సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అతి శ్రమ వలన కాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : ఈ రోజు అదృష్టం మీ పక్షాన ఉంది. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. గందరగోళం వద్దు పాజిటివ్ గా ఆలోచించండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టకండి. వ్యాపారపరంగా ప్రయాణం. కావలసినంత ధనం చేతికి లభిస్తుంది పొదుపు చేయండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క అనారోగ్యం మిమ్మల్ని కొంచెం అశాంతికి గురి చేస్తుంది.

కుంభరాశి : కొన్ని విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ డబ్బు వ్యవహారాల గురించి ఎవరితోటి రహస్యాలను చెప్పకండి. కుటుంబ వ్యవహారాలు కొంచెం ఆందోళనను కలిగిస్తాయి. ఆఫీసు పనులను మీ తోటి ఉద్యోగులు వారికి అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. అవసరాలకు ఖర్చు పెడతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. శుభవార్తలు అందుతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. దైవ ప్రార్ధన వలన దైవ బలం లభిస్తుంది. ఆఫీసు పనులలో తోటి ఉద్యోగస్తులతో తొందరపడి నోరు జారకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.



Next Story

Most Viewed