శుక్రవారం పంచాంగం, రాశి ఫలాలు (21-05- 2021)

by  |
శుక్రవారం పంచాంగం, రాశి ఫలాలు (21-05- 2021)
X

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వఫల్గుణి
(నిన్న సాయంత్రం 3 గం॥ 53 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 17 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : కౌలవ
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 4 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : సింహము

రాశి ఫలాలు..

మేష రాశి..

ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో విశేషమైన గుర్తింపు ప్రతిఫలం లభిస్తాయి. ఈరోజు డబ్బు పరమైన లావాదేవీలలో జాగ్రత్తగా వ్యవహరించండి ధననష్టం నివారించండి. రియల్ ఎస్టేట్ ఆహారధాన్యాల వ్యాపారం బాగుంటుంది. ఈ రాశి స్త్రీలకు మీ మెతకవైఖరి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది.

వృషభ రాశి..

ధనము చేతికి అందడం వల్ల అప్పులు తీర్చి వేయగలుగుతారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులతో తెలివిగా సహనంతో వ్యవహరించండి. వాడికి నిదానంగా సమాధానం ఇవ్వండి. ఈ కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నా పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కంటి సైట్ పెరిగే అవకాశం ఉంది. చెక్ చేసుకోండి. ఈ రాశి స్త్రీలు ముఖ్యమైన విషయాలలో పెద్దల మాటలు వినటం వలన లాభం కలుగుతుంది.

మిధున రాశి..

ధన సంపాదనకు నూతన మార్గాలు అన్వేషిస్తారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులతో అభిప్రాయభేదాలు రావచ్చు. అలాగే పని విషయంలో పై అధికారులతో మాటలు. సహనంతో వ్యవహరించండి. ఈ కరోనా సమయంలో వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. స్థిరాస్తి వివాదాలను వీలైనంతవరకూ పరిష్కరించే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన విషయాల గురించి మీ పెద్దవారితో చర్చిస్తారు. ఈ రాశి స్త్రీలు అపోహలు ఊహలతో ఎక్కువగా గడపకండి.

సింహరాశి..

ఈ కరోనా సమయంలో విచారం అనుమానాలను వదిలివేయండి. దైవసహాయం తోడు ఉంది. సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన లావాదేవీలలో ముఖ్యంగా డాకుమెంట్స్ సంతకం పెట్టే విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించండి. కార్యాలయంలో మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి. ఈ రాశి స్త్రీలు అవకాశవాదులను దూరం పెట్టండి.

కన్య రాశి..

స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా నూతన అవకాశాలు లభిస్తాయి. ఎంతోకాలంగా చేస్తున్న రుణ ప్రయత్నాలు పరిష్కారమవుతాయి. ఈ కరోనా సమయంలో కొన్ని వ్యయప్రయాసలు. మీ జీవిత భాగస్వామి కోరిక తీరకపోవడంతో అపార్ధాలకు అవకాశం. ఈ రాశి స్త్రీలు ఎటువంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి..

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుతారు. ఈ కరోనా సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడులను నివారించండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అకారణ ద్వేషాన్ని విడనాడండి. పిల్లలతో ఓపికగా సంభాషించండి వారి అనుమానాలు నివృత్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు విదేశీయాన సంబంధ విషయాలు లాభిస్తాయి.
తులారాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. ఈ కరోనా సమయంలో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు చికాకులు. ఈ రాశి స్త్రీలకు వంశపారంపర్యంగా రావలసిన ఆస్తిలో మీ వాటా నీకు దక్కుతుంది.

వృశ్చిక రాశి..

మీ అభివృద్ధిని చూసి ఏడ్చేవాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు జాగ్రత్తగా ఉండండి. సోదరులు మిత్రులతో విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. నెగెటివ్ థాట్స్ వదిలేయండి అవి మీ అభివృద్ధికి ఆటంకం. మంచి ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తుల పెట్టుబడులు లాభాలను తెస్తాయి. జీవిత భాగస్వామితో గడపటం ఎంత విలువ అయినదో గ్రహిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మీ సలహాల కోసం వస్తారు.

ధనస్సు రాశి..

మీ ఆత్మ విశ్వాసం తో ఆశయాలను నెరవేర్చుకుంటారు. మనసుపెట్టి చేసే పనుల్లో శ్రీఘ్ర పురోగతి ఉంటుంది. మీరు దాచి ఉంచిన ధనం సరైన పెట్టుబడుల లో పెట్టండి మంచి లాభాలున్నాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు. టీవీ కంప్యూటర్లతో ఎక్కువ సమయం గడపటం వృధా. ఈ రాశి స్త్రీలకు ఆదాయం బాగున్నప్పటికీ పొదుపు చేయడం కష్టమవుతుంది.

మకర రాశి..

మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. శ్రేష్టమైన సమయం. అందరిలోనూ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులు మంచి లాభాలు వస్తాయి. సామాజిక కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. జీవితభాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు దూరమవుతాయి. సమర్ధులు అని మీరు అనుకున్న కొంతమంది ఎందుకూ పనికి రారు అని మీరు తెలుసుకుంటారు. ఈ రాశి స్త్రీలకు విదేశాలలో చదువుకోవాలని అనుకునే మీ కోరిక నెరవేరుతుంది.

కుంభరాశి..

శత్రువులను దెబ్బతీస్తారు వారిని వశ పరుచుకుంటారు. తరచూ ధన లాభం కలిగే సూచనలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం. స్థిరాస్తి ఒప్పందాలకు దొరుకుతాయి అధిక లాభాలు వచ్చే అవకాశం. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. వ్యాపారంలో కలిసి వస్తుంది సంపదలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రాశి స్త్రీలకు మీ హుందా ప్రవర్తన మీకు సమాజంలో మంచి పేరు తెస్తుంది.

మీన రాశి..

ధన పరమైన విషయంలో కోర్టు తీర్పు ఒకటి మీకు అనుకూలంగా వస్తుంది. తద్వారా బంగారు మయ జీవితం ఏర్పడుతుంది. చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తిచేస్తారు. కార్యాలయంలో మీకు సంబంధం లేని వ్యవహారాలలో తల దూర్చ వద్దు లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం. ఈ కరోనా సమయంలో లేనిపోని అనుమానాలు తో మానసిక అశాంతి. ఈ రాశి స్త్రీలు ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు మీ అభిప్రాయానికి విలువ లేని చోట పని చేయడం అనవసరం అని భావిస్తారు.

Next Story