శుక్రవారమే లాస్ట్.. హుజురాబాద్‌లో నామినేషన్ల జాతర.. బలగాల మోహరింపు

by  |
శుక్రవారమే లాస్ట్.. హుజురాబాద్‌లో నామినేషన్ల జాతర.. బలగాల మోహరింపు
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ బై పోల్స్‌లో నామినేషన్ల జాతర ప్రక్రియ కొనసాగుతోంది. చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు రిటర్నింగ్ ఆఫీస్ వద్దకు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున.. బీజేపీ తరుఫున మరో సెట్ నామినేషన్ వేశారు.

అలాగే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు.

మోహరించిన బలగాలు..

నామినేషన్ ప్రక్రియలో చివరి రోజు కావడంతో హుజురాబాద్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed