యూకే, పోలాండ్‌లో మోనోలిత్‌లు.. ప్రత్యక్ష్యం

by  |
యూకే, పోలాండ్‌లో మోనోలిత్‌లు.. ప్రత్యక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారితోపాటు రొమేనియాలోని కాలిఫోర్నియాలో, ఇంగ్లాండ్‌లోని ఐజిల్ ఆఫ్ విట్, యూఎస్ టెక్సాస్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్ కారు పార్కింగ్ ప్లేస్‌లో ఇటీవల మోనోలిత్‌(లోహపు స్తంభం)లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. తాజాగా యూకే, పోలాండ్ దేశాల్లో మోనోలిత్‌లు అకస్మాత్తుగా ప్రత్యక్ష్యమయ్యాయి. ఇలా ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న మోనోలిత్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద మిస్టరీగా మారాయి. పోలాండ్‌ దేశం వార్సా నగరంలోని విష్టులా నది ఒడ్డున ఒకటి.. కైల్స్ నగరంలోని నేచర్ రిజర్వ్ వద్ద మరొక మోనోలిత్ కనిపించినట్లు అక్కడ ప్రజలు చెబుతున్నారు. 10 అడుగుల ఎత్తులో బూడిద రంగు ఉన్న ఈ లోహపు స్తంభాన్ని జాగింగ్‌కు వచ్చిన వాళ్లు గుర్తించారు. ఎవరో తీసుకొచ్చి నది ఒడ్డున పాతినట్లుగా తెలుస్తోందని చెప్పారు.

నేచర్ రిజర్వ్ దగ్గరలోని సైట్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి.. అక్కడ 9 అడుగుల ఎత్తు ఉన్న స్తంభాన్ని గుర్తించాడు. యూకేలోని గ్లాస్తన్‌బరి కొండల వద్ద ఓ మోనోలిత్ ప్రత్యక్ష్యమయింది. అటుగా వెళ్లే ప్రజలు దీనిని గుర్తించారు. గత కొద్దిరోజులుగా ‘మోనోలిత్’లు పరిశోధకులను పరేషాన్ చేస్తున్నాయి. మొదట అమెరికాలో దర్శనమిచ్చిన ఈ మోనోలిత్ ఆ తర్వాత అక్కడ్నుంచి మాయమై రొమేనియాలో.. తర్వాత బ్రిటన్‌లో ప్రత్యక్ష్యమయ్యాయి. అసలు ఈ మోనోలిత్‌లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరైనా తీసుకొచ్చి పెడుతున్నారా? అనే విషయం తెలుసుకునేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. ఇలా మోనోలిత్‌లు ప్రత్యక్ష్యమవడానికి గ్రహాంతర వాసులు కారణమని అని కొందరు వాదిస్తున్నారు. కానీ, అందుకు సరైన ఆధారాలేవీ లేవు. మోనోలిత్‌లు అలా ఎలా ప్రత్యక్షమవుతున్నాయనే విషయం మిస్టరీగానే మిగిలిపోతుందేమోనని పలువురు విశ్లేషిస్తున్నారు. ‘2001: ఏ స్పేస్ ఒడిస్సీ’ సినిమాలో వలె మోనోలిత్ కనిపిస్తే, అందరికీ అదృష్టం కలిసి వస్తుందనే భావనతో కొంతమంది ఇలా చేసి ఉంటారని అంటున్నారు. 2020 ముగింపు ‘మోనోలిత్’ ట్విస్ట్‌తో ముగుస్తుందేమోనని, 2020లో జరిగిన నష్టానికి 2021 శుభముహుర్తంగా నిలవనుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/susieneilson/status/1336711321656541186/photo/1



Next Story

Most Viewed