ఒకే ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ఉచితం..

331

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్‌ అన్నింట్లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూడడం కోసం ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవల్సి వస్తుంది. అయితే దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు ఏదో ఒక OTT ప్లాట్ ఫామ్ మాత్రమే కలిగి ఉంటారు. కానీ అన్నీ  కావాలి అనుకునే వారి కోసం ఓ మార్గం ఉంది. ఒకే ప్లాన్‌తో Amazon Prime, Netflix, Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం రిలయన్స్ జియో యూజర్లకు సాద్యపడుతుంది.

జియో పోస్ట్‌పెయిడ్‌తో ఒకే ప్లాన్‌ తీసుకొని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లన్నీ వినియోగించుకోవచ్చు. రూ.399తో ప్రారంభమయ్యే ప్లాన్‌లతో ఈ ప్రయోజనాలన్నీ జీయో వినియోగదారులు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు జియో అందించే అన్ని సేవలు పొందవచ్చు. దానికి సంబందించిన పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

రూ.399 ప్లాన్ 

ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 75జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వినియోగించుకోవచ్చు. వ్యాలిడిటీ 30 రోజులు.

రూ.599 ప్లాన్ 

అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, 100జీబీ డేటా, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అలాగే ఫ్యామిలీ ప్లాన్ కింద అదనంగా మరో సిమ్ కార్డు లభిస్తుంది. 

రూ.799 ప్లాన్

150జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్, అలాగే ఫ్యామిలీ ప్లాన్ కింద అదనంగా 2 సిమ్ కార్డులు పొందవచ్చు. అలాగే ఈ మూడు ప్లాన్‌లకు 200 జీబీ వరకు డేటా రోల్‌ఓవర్ సదుపాయం ఉంది. అంటే ఒకవేళ డేటా మిగిలిపోతే అది తర్వాత నెలకు కూడా కొనసాగుతుంది. 

రూ.999 ప్లాన్

ఈ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే 200జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ పోందవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ కింద 3 అదనపు సిమ్ కార్డులు తీసుకోవచ్చు. 500 జీబీ డేటా రోల్‌ఓవర్ సదుపాయం కలదు. 

రూ.1,499 ప్లాన్

ఎక్కువ డేటా కావాలి అనుకునే వారికి ఈ ప్లాన్ నచ్చుతుంది. దీని ద్వారా 300 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే అమెరికా, యూఏఈ దేశాలకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 500 జీబీ డేటా రోల్‌ఓవర్ సదుపాయం కలదు.