నేను గెలిస్తే.. చంద్రమండలానికి ఫ్రీ ట్రిప్, పెళ్లిళ్లకు బంగారం..

by  |
నేను గెలిస్తే.. చంద్రమండలానికి ఫ్రీ ట్రిప్, పెళ్లిళ్లకు బంగారం..
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్ధులు సంచలన హామీలు ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి తులం శరవణన్ ఇచ్చిన హామీలు చూస్తే షాక్ అవాల్సిందే.

తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఏడాదికి రూ. కోటి, ఓ మినీ హెలికాప్టర్, పెళ్లిళ్లుకు బంగారు నగలు, మూడంతస్తుల భవనం కట్టించి ఇస్తానని శరవణన్ హామీ ఇస్తున్నాడు. అంతేకాదు, చంద్రమండలానికి కూడా తీసుకెళ్తానని చెబుతున్నాడు. నియోజకవర్గంలో గృహిణుల పనిభారాన్ని తగ్గించేందుకు ప్రతీ ఇంటికి రోబోట్, ప్రతి కుటుంబానికి ఒక పడవ, నియోజకవర్గాన్ని చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తానని శరవణన్ హామీ ఇచ్చారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీలో ఉండగా.. శరవణన్ హామీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ఉచితాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే నా లక్ష్యమని అన్నారు. సాధారణ ప్రజలు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాని అని అన్నారు. ఎన్నికల సందర్భంగా నేతలు ఆచారణకు సాధ్యం కానీ వాగ్థానాలను ఎత్తిచూపడానికే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అన్నారు.

అయితే ఈ ఎన్నికల్లో శరవణన్ ఎన్నికల గుర్తు డస్ట్‌బిన్. ఎన్నికల్లో ఓటర్లు తమ విలువైనా ఓట్లను తన డస్డ్‌బిన్‌లో వేసి గెలిపించాలని కోరుతున్నారు. శరవణన్‌కు ఇంకా పెళ్లికాకపోవడం విశేషం. దేశంలోనే తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజకీయ నేతల వాగ్ధానాలు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. అక్కడ అధికార, ప్రతిపక్ష నేతలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తారు.

Next Story