ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ

by  |
ఆ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ
X

ఇండోనేషియా: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వీధిన పడ్డారు. ఎప్పుడెప్పుడు మహమ్మారి బారి నుంచి విముక్తి దొరుకుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఫార్మా దిగ్గజ కంపెనీలు కరోనాకు టీకాను కనిపెట్టాయి.. పెడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకడుగు ముందుకేసీ వ్యాక్సినేషన్ పంపిణీని కూడా మొదలు పెట్టారు. తాజాగా ఇండోనేషియా కూడా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్నది.

ఇండోనేషియా దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు. అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ శాఖ అనుమతులు ఇవ్వగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనిని ప్రజలకు పూర్తి ఉచితంగా అందజేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ భద్రతపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం కోసం తొలి టీకాను తానే తీసుకుంటానని అధ్యక్షుడు విడొడొ తెలిపారు. చైనా అభివృద్ధి చేసిన ‌‘కరోనావాక్’ వ్యాక్సిన్ తొలి షిప్‌మెంట్ ఈ నెల తొలివారంలో ఇండోనేషియాకు చేరుకున్నది.

Next Story