ఒమిక్రాన్ భయంతో పెరిగిన విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ!

by  |
FPI
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య విదేశీ పెట్టుబడిదారులు డిసెంబర్‌లోనూ నిధులను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 17,696 కోట్లు వెనక్కి వెళ్లాయని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీల నుంచి రూ. 13,470 కోట్లను, రుణ విభాగం నుంచి రూ. 4,066 కోట్ల, హైబ్రిడ్ అసెట్‌స్ నుంచి రూ. 160 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నవంబర్‌లో మొత్తం రూ. 2,521 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఎఫ్‌పీఐ అమ్మకాలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉన్న నేపథ్యంలో దేశీయంగా కూడా వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని, దీనివల్ల మదుపర్లు అమ్మకాలకు సిద్ధపడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ధోరణి ఉండటంతో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరణ ధోరణిని ఇంకా కొంతకాలం కొనసాగిస్తారని వివరించారు.



Next Story

Most Viewed