హైదరాబాద్‌లో నాలుగు కొత్త కొవిడ్ కేంద్రాలు

by  |
హైదరాబాద్‌లో నాలుగు కొత్త కొవిడ్ కేంద్రాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నాలుగు కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.79 కోట్లను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన నిధులను ఈ అవసరాల కోసం ఖర్చు చేసేలా.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేంద్రాలు నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్‌లోని నిజామియా టిబ్బి ఆసుపత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రులను కరోనా కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే రూ.1.79 కోట్లను తక్షణం పారిశుధ్యం, సెక్యూరిటీ, లాండ్రీ, బయో వ్యర్థాల నిర్వహణ, కరోనా పేషెంట్ల ఆహారపు అవసరాలకు ఖర్చు చేయాలని రిజ్వి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed