బ్రేకింగ్.. బీజేపీలో చేరిన TSPSC మాజీ సభ్యుడు విఠల్

by Anukaran |
బ్రేకింగ్.. బీజేపీలో చేరిన TSPSC మాజీ సభ్యుడు విఠల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : TSPSC మాజీ సభ్యుడు విఠల్ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్‌తో పాటు స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సమక్షంలో సోమవారం ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజమైన ఉద్యమకారులందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చేందుకు బీజేపీ నిరంతరం కృషిచేస్తోందన్నారు. మంగళవారం తీన్మార్ మల్లన్న పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు సంజయ్ ప్రకటించారు.

Next Story