రజనీష్ కుమార్ కు చైనా పదవి.. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకం

by  |
rajanish-kumar
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బ్యాంకు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్‌ను హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(హెస్ఎస్‌బీసీ) ఇండిపెండెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తున్న సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగంలో నాలుగు దశాబ్దాల సుధీర్ఘమైన అనుభవం సంస్థకు ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ అభిప్రాయపడింది. 2020లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన రజనీష్, బాధ్యతల్లో ఉన్న సమయంలో ఎస్‌బీఐ డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో ఎంతో పటిష్ఠంగా మారిందని, దేశీయ ఆర్థిక సేవల రంగంలో ఆయనకున్న అనుభవం తమకెంతో ఉపకరిస్తుందని హెచ్ఎస్‌బీసీ బోర్డు ఛైర్మన్ పీటర్ వాంగ్ వివరించారు.

హెచ్ఎస్‌బీసీ నాన్-ఎగ్జిక్యూటి డైరెక్టర్‌గానే కాకుండా బ్యాంకు ఆడిట్ కమిటీ, రిస్క్ కమిటీ సభ్యుడిగా కూడా ఉంటారని సంస్థ తెలిపింది. దేశీయంగా వృద్ధి అవకాశాలను కీలకంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామని పీటర్ వాంగ్ పేర్కొన్నారు. కాగా, రజనీష్ కుమార్ ప్రస్తుతం భారత లైట్‌హౌస్ కమ్యూనిటీష్ ఫౌండేషన్ డైరెక్టర్, ఎల్అండ్‌టీ ఇన్ఫోటెక్ స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీనియర్ సలహాదారుగా ఉన్నారు.

Next Story

Most Viewed