శభాష్ రవీందర్.. లారీ డ్రైవర్ల ఆకలి తీరుస్తున్న రైతు

by  |
శభాష్ రవీందర్.. లారీ డ్రైవర్ల ఆకలి తీరుస్తున్న రైతు
X

దిశ, ఆదిలాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. ఈ క్రమంలో వస్తు రవాణా కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న లారీ డ్రైవర్లు తిండి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల వెంట దాబాలు మూసి ఉండటంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన రైతు నార్లపురం రవీందర్ ప్రతిరోజు లారీ డ్రైవర్ల ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చారు. ఆయన స్వస్థలం నిర్మల్. జిల్లాలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద బుధవారం అన్నదాన సత్రం ప్రారంభించారు. లారీ డ్రైవర్లకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఈ అన్నదాన సత్రాన్ని ఎస్పీ శశిధర్ రాజు ప్రారంభించారు. అన్నార్థుల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమని రవీందర్‌ను ఆయన అభినందించారు. వస్తు రవాణా కోసం లారీ డ్రైవర్లు జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రయాణిస్తారని, లాక్‌డౌన్ నేపథ్యంలో తిండి దొరకక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వారికోసం అన్నదాన సత్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు. రవీందర్ వంటి వ్యక్తులకు సాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని ఎస్పీ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, lorry drivers, food provide, former, sp shashidhar raju praises

Next Story