అక్రమాస్తుల కేసులో మాజీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష

by  |
Paramashivam
X

దిశ, వెబ్‌డెస్క్ : అవినీతికి పాల్పడి, అక్రమంగా ఆస్తులు సంపాదించిన మాజీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండి అప్పనంగా కూడబెట్టడాన్ని ఆక్షేపించింది. లక్షల రూపాయలను ఫైన్ గా వేసింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పమరశివం కేసులో కోర్డు ఈ తీర్పు ఇచ్చింది.

విల్లుపురం జిల్లా చిన్న సేలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1991లో పరమశివం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలో సీఎం గా జయలలిత ఉన్నారు. అయితే 1991-96 మధ్య కాలంలో పరమశివం ఆధాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని డీఎంకే కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ.. విల్లుపురం కోర్టులో తన వాదనలు వినిపించింది. విచారణలో పరమశివం తన ఇద్దరు కుమారులు, భార్య పేరిట అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని రుజువు కావడంతో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.33 లక్షల జరిమానాను విధించింది. ఫైన్ కట్టలేని పరిస్థితిలో మరో ఏడాది జైలు జీవితం అనుభవించాలని తీర్పు చెప్పింది.


Next Story

Most Viewed