ఎన్నికల వేళ కాంగ్రెస్‌క్ భారీ షాక్.

by  |
Manipur-congress
X

గువహటి: మణిపూర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోవిందాస్ కొంతుజామ్ బీజేపీ లో చేరారు. గోవిందాస్ బిష్నూపూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అయితే కొద్దిరోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసిన ఆయన, గతనెల 28 న రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందించి, రెండు రోజుల వ్యవధిలో బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్,రాష్ట్ర పార్టీ చీఫ్ సంబిత్ పాత్ర పాల్గోన్నారు. వారివురు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ‘ మోడీ ఈశాన్య రాష్ట్రాలను అభివ్రుద్ది పథంలో నడుపిస్తున్నారని, మంత్రి వర్గ విస్తరణలో ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవి ఇవ్వటం దీనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు’. కొన్ని రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గొవిందాస్, బీజేపి వైపు మళ్లటంతో మణిపూర్ లో కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతీశాయని రాజకీయ నిపుణులంటున్నారు.

2017 లో మణిపూర్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ గా నిలిచింది. అయితే వ్యూహత్మక తప్పిదాలతో అధికారం కొల్పోయింది. అయితే ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కి తెలుసని, త్వరలో మణిపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జీ రాష్ట్రంలో పర్యటిస్తారని అక్కడి కాంగ్రెస్ నేతలు అంటున్నారు.



Next Story

Most Viewed