మాజీ అటార్నీ జనరల్ కరోనాతో కన్నుమూత

by  |
former attorney general sorabjee
X

న్యూఢిల్లీ: సీనియర్ అడ్వకేట్, ప్రఖ్యాత జ్యూరిస్ట్, పద్మ విభూషణ్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ(91) శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ సోలి సొరాబ్జీ ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితులు విషమించి ఈ రోజు ఉదయం మరణించారు. సోలి సొరాబ్జీకి మానవ హక్కుల కార్యకర్తగా అన్నివర్గాల నుంచి మంచి పేరుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 1930లో జన్మించిన సోలి జెహంగీర్ సొరాబ్జీ బాంబే హైకోర్టులో 1953లో లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1971లో అతన్ని సీనియర్ కౌన్సిల్‌గా సుప్రీంకోర్టు నియమించింది. 1989లో ఒకసారి, 1998 నుంచి 2004 కాలంలో మరోసారి సొరాబ్జీ అటార్నీ జనరల్ ఫర్ ఇండియాగా సేవలందించారు.

Next Story

Most Viewed