ప్రాణాలైనా తీసుకోండి.. కానీ, నా భూమిని మాత్రం లాక్కోకండి: బాధిత మహిళ

by  |
raithu-1
X

దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో పోడు రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొని తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం మండలంలోని నీలంపల్లి పరిధిలోని పోడు, సాగు భూముల్లో అటవీ శాఖాధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ట్రెంచ్ పనులు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో నా ప్రాణాలైనా తీసుకోండి.. కానీ, నా భూమిని మాత్రం లాక్కోకండి అంటూ బాధిత మహిళ విలపిస్తూ జేసీబీ యంత్రానికి అడ్డుకుంది. నా బిడ్డకు కట్నంగా ఇచ్చిన భూమిలో ట్రెంచ్ లు తీసి మా జీవితాలను ఆగం చేయవద్దు అంటూ బోరున విలపించినా అటవీ శాఖధికారులు కనికరించలేదు. మీ ప్రాణాలతో మాకేంటి మీరు ఎన్ని చెప్పినా ట్రెంచ్ తీయడం తప్పదు.. ఎవరు అడ్డు వచ్చినా వినేది లేదంటూ అటవీ అధికారులు ట్రెంచ్ పనులు ప్రారంభించారు. నీలంపల్లి, ఎదుళ్లపల్లి గ్రామాలకు చెందిన మూడు కుటుంబాలకు సంబందించిన దాదాపు 10 ఎకరాల భూమిలో ట్రెంచ్ లు తీసి స్వాధీన పరుచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో అటవీ శాఖధికారులను ఉసి గొలిపి తమ భూములను లాక్కోవడం హేయమైన చర్య అని రైతులు మండిపడ్డారు. తక్షణమే పోడు, సాగు భూములపై దాడులు నిలిపివేసి.. హక్కు పత్రాలు అందజేయాలని వారు డిమాండ్ చేశారు.

raithulu-2

Next Story

Most Viewed