వారం రోజల్లో చర్చలు మూడు గంటలే

by  |
వారం రోజల్లో చర్చలు మూడు గంటలే
X

న్యూఢిల్లీ: పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు గత సోమవారం(మార్చి 2) మొదలైన సంగతి తెలిసిందే. ఈ వారం రోజుల కాలంలో ఎగువ సభలో కేవలం మూడంటే మూడు గంటలు మాత్రమే సభ్యులు చర్చలో కూర్చున్నారు. మిగతా కాలమంతా ఆందోళనలు, నిరసనలకే పరిమితమయ్యారు. ఢిల్లీ హింసపై చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో మొదటివారం 28.30 గంటలు చర్చించాలని షెడ్యూల్ ఉన్నది. కానీ, ఈ వారంలో కేవలం 2.42 గంటలు మాత్రమే చర్చలు జరిగాయి. అంటే 25.48 గంటలు చర్చ జరగకుండా ఆందోళనలు, వాయిదాలతో వృథా అయ్యాయని అధికారులు తెలిపారు.

tags: rajya sabha, lost time, adjournment, protests, productivity

Next Story

Most Viewed