ఊర మాస్ డైలాగ్స్ తో అంచనాలను మించిపోయిన పుష్ప ట్రైలర్ 

by  |
puspha trailer
X

దిశ సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ఇందులో అల్లు అర్జున్ లోని ఊర మాస్ రోల్‌ను మనం చూడోచ్చు. ముందుగా ట్రైలర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమై, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కనిపిస్తుంది.

అంతేకాకుండా ఇందులో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి.. “లోకం మీకు గన్ ఇస్తే నాకు గొడ్డలి(గొడ్డలి) ఇచ్చింది.” “పుష్ప అంటే పువ్వు అనుకున్నారా…. FIREEE”. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ ట్రైలర్‌కి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై, సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదల కానుంది.


Next Story

Most Viewed