నాగాలాండ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!

by  |
నాగాలాండ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ :

హెడ్డింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా! అవును.. ఇవే మాటలతో నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌ను ట్రోల్ చేశారు. భారతదేశం నుంచి నాగాలాండ్‌ను ఫ్లిప్‌కార్ట్ వేరుచేస్తోందని, స్వాతంత్య్రం ఇచ్చిందని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తట్టుకోలేక ఏకంగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు కూడా చెప్పింది. ఇంతకీ ఇలా కామెంట్ చేయడానికి, ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పడానికి దారితీసిన సంఘటన గురించి చెప్పలేదు కదా.. అయితే చదవండి.

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి మీద భారతదేశంలోని ఇతర రాష్ట్రాల వారు వివక్ష చూపిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. వాళ్ల రూపురేఖలు కాస్త చైనీయుల మాదిరిగా ఉండటంతో వారిని భారతీయులు కాదన్నట్లుగా చూస్తుంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి భారతీయులే. మనకంటే అద్భుతంగా హిందీ భాష కూడా మాట్లాడగలరు. అయినప్పటికీ వారి మీద ఎన్నో ప్రాంతీయభేదాలను చూపిస్తుంటారు. దీని గురించి వాళ్లు ఆందోళనలు చేసినా కూడా ఆ ధోరణిలో మార్పు రాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఫ్లిప్‌కార్ట్ కూడా సరిగ్గా అలాంటి పనే చేయడం వల్ల ఈశాన్య రాష్ట్రాల వారికి కోపం వచ్చింది. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ ఏం చేసిందంటే..

నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి, ఫ్లిప్‌కార్ట్ ఫేస్‌బుక్ పేజీలో ఒక ప్రశ్న అడిగాడు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ అందుబాటులో ఉంది, కానీ నాగాలాండ్‌లో ఎందుకని డెలివరీ చేయడం లేదని ఆ ప్రశ్న సారాంశం. దానికి ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన సమాధానం.. చివరకు ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ సమాధానం ఏంటంటే.. ‘మేం భారతదేశం వెలుపల డెలివరీ చేయలేం. అందుకు చింతిస్తున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ రిప్లయ్ ఇచ్చాడు. ఇది చదివిన ఈశాన్య రాష్ట్రాల నెటిజన్లు విరుచుకుపడ్డారు. నాగాలాండ్, భారతదేశంలో ఒక భాగం అని ఫ్లిప్‌కార్ట్ అనుకోవడం లేదు, నాగాలాండ్‌కు స్వాతంత్య్రాన్ని ఇచ్చేసింది అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లు తట్టుకోలేక, ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు అడగటంతో పాటు త్వరలోనే నాగాలాండ్‌లో కూడా డెలివరీ చేయడం ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.

F

Next Story

Most Viewed