మానేరు నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

by  |
మానేరు నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్లలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం శివారులోని మానేరు నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్‎నగర్‎కు చెందిన 8 మంది విద్యార్థులు సోమవారం మానేరు నదిని చూడటానికి వెళ్లారు. ఈత కొడదామని నెహ్రూ నగర్ సమీపంలోని చెక్ డ్యామ్‌లోకి దిగారు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో స్థానికుల సాయంతో పోలీసులు చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో మృతదేహాలను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed