రికార్డు స్థాయిలో IIT మద్రాసు ప్లేస్ మెంట్స్..

2182

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)మద్రాసు, క్యాంపస్ ప్లేస్‌ మెంట్స్‌లో భాగంగా మెుదటి రోజు విద్యార్థులు అత్యధికంగా 34 కంపెనీల నుండి 176 ఆఫర్‌లను అందుకున్నారు. ఇందులో 11 అంతర్జాతీయ ఆఫర్‌లు ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ సారి 43 శాతం ఎక్కువ ఆఫర్‌లను అందుకున్నారు.. 2020-21లో ఇదే సమయంలో 22 కంపెనీలు 123 ఆఫర్‌లను అందించాయి.

మైక్రోసాఫ్ట్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, బజాజ్ ఆటో, బైన్ అండ్ కంపెనీ, గోల్డ్‌మన్ సాక్స్, క్వాల్కమ్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, JP మోర్గాన్ ఛేజ్ & కో, మెకిన్సే వంటి కంపెనీలు రిక్రూట్‌మెంట్ జాబితాలో ఉన్నాయి. “మా విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శన, అకడమిక్ శిక్షణ, నాణ్యత వలన ఇలాంటి   రిక్రూట్‌మెంట్‌లు జరిగాయని ఇది మా విలువలకు నిదర్శనం” అని ఐఐటి మద్రాస్ సలహాదారు (ట్రైనింగ్, ప్లేస్‌మెంట్) ప్రొఫెసర్ సిఎస్ శంకర్ రామ్ అన్నారు.