బ్రేకింగ్ : ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం.. నిలిచిపోయిన సినిమా షూటింగ్

by  |
film nagar fire accident
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న జనరేటర్‌ వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫిలింనగర్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఆ సమయంలో పక్కనే ఉన్న జనరేటర్‌ వాహనంలో మంటలు చెలరేగాయి. అందులో నుంచి డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. ఇక ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమయ్యింది. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోయేసరికి అందరు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంతో షూటింగ్‌ నిలిచిపోయినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed