షూటింగ్‌కు అనుమతి తప్పనిసరి:ప్రమోద్

by  |
షూటింగ్‌కు అనుమతి తప్పనిసరి:ప్రమోద్
X

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోవాలో సినిమా షూటింగ్ చేయాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు. చాలా సినిమాల్లో గోవాను మాదక ద్రవ్యాల స్థావరంగా చూపిస్తున్నందున రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇటీవల వచ్చిన బాలీవుడ్ మూవీ ‘మలంగ్’లో గోవాను డ్రగ్స్ తీసుకునేందుకు స్వర్గంలాంటి స్థలంగా చూపించడంపై సీరియస్ అయిన ఆయన… ఇది రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తుందన్నారు. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ప్రతి స్క్రిప్ట్‌నూ నిశితంగా పరిశీలిస్తుందనీ, ఆ తర్వాతే అనుమతి ఇస్తుందని స్పష్టం చేశారు. ఎంటర్టైన్మెంట్ సొసైటీ నుంచి అనుమతులు పొందాకే షూటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

Next Story