- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒంగోలు కోర్టుకు హాజరైన సినీ నిర్మాత

X
దిశ, ఏపీ బ్యూరో: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టుకు హాజరయ్యారు. చెక్ బౌన్స్ కేసులో సోమవారం తన న్యాయవాదితో కలిసి ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ ఇచ్చిన 1.25 కోట్ల చెక్కు బౌన్స్ అయింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో బండ్ల గణేశ్ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఎదుట మధ్యాహ్నం హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 9 కి వాయిదా పడింది.
Next Story