Disha daily (దిశ): Latest Telugu News | Breaking news https://www.dishadaily.com Latest Telugu Breaking news (తెలుగు న్యూస్) in all digital platforms Fri, 15 Oct 2021 18:12:47 +0000 en-US hourly 1 https://www.dishadaily.com/wp-content/uploads/2020/04/disha-logo-45x45.png Disha daily (దిశ): Latest Telugu News | Breaking news https://www.dishadaily.com 32 32 గర్జించిన చెన్నై సింహాలు.. IPL ఫైనల్‌లో CSK ఘన విజయం https://www.dishadaily.com/csk-team-defeat-kkr-team-in-ipl-final-2021 Fri, 15 Oct 2021 18:06:21 +0000 https://www.dishadaily.com/?p=306428 దిశ, వెబ్‌డెస్క్ : అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ -2021 టోర్నీని ధోన సేన ఎగరేసుకుపోయింది. శుక్రవారం kkr vs csk మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసి సీఎస్కే జట్టు విధించిన 193 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ఓపెనర్లు తొలి 10 ఓవర్లలో చెన్నై ఆటగాళ్లకు భయం అంటే ఎంటో చూపించారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) చెరో అర్థ సెంచరీలతో ధోని సేనకు చుక్కలు చూపించారు.

అయితే, 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ మొత్తం సీఎస్కే చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. చైన్నై బౌలర్లు విజృంభించడంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్‌మెన్స్ వచ్చినట్టే వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చైన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ -3, రవీంద్ర జడేజా-2, హజీల్ వుడ్ -2 వికెట్లు తీయడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది.

ఒకానొక సమయంలో 19వ ఓవర్లో 162/8 పరుగుల కేకేఆర్ టేలెండ్ బ్యాట్స్ మెన్స్ జట్టును గెలిపించేందుకు చాలా కష్టపడ్డారు. కానీ చివరి ఓవర్‌ను బ్రావో తనదైన విధంగా స్లో బంతులు వేసి కేకేఆర్ జట్టుకు ఓటమి అంటే ఎంటో రుచి చూపించాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో KKR జట్టుపై 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. చాలా మంది మాజీ సీనియర్ ఆటగాళ్లు చెప్పిన విధంగానే ధోని మరోసారి చెన్నై జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ధోని ఫామ్‌లో ఉన్నా లేకున్నా.. ఆయన కెప్టెన్సీలో సీఎస్కే జట్టు ఫైనల్‌లో గెలుస్తుందని సౌత్ ఆఫ్రికా పేసర్ డెేల్ స్టెయిన్ చెప్పిన జోస్యం నిజమైంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని సారధ్యంలో నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/dhoni-4.jpg 2021, csk, international, ipl final match, KKR, trending news 2021-10-15 23:42:47 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/dhoni-4.jpg Alia Bhatt https://www.dishadaily.com/alia-bhatt-hottest-pic Fri, 15 Oct 2021 17:47:26 +0000 https://www.dishadaily.com/?p=306421 Alia Bhatt Alia Bhatt Alia Bhatt

]]>
https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/244796171_398269051749271_891643718027820574_n-842x1024.jpg 2021-10-15 23:17:27 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/244796171_398269051749271_891643718027820574_n-842x1024.jpg
KKR టాప్ ఆర్డర్‌ను కూల్చిన CSK బౌలర్లు.. https://www.dishadaily.com/csk-ready-to-defeat-kkr-team Fri, 15 Oct 2021 17:37:34 +0000 https://www.dishadaily.com/?p=306417 దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన విషయం తెలిసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి 10 ఓవర్లలో చెన్నై జట్టుకు చుక్కలు చూపించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) చెరో అర్థ సెంచరీలతో ధోని సేనను భయం అంటే ఎంటో చూపించారు. అయితే, 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ స్వరూపాన్నిసీఎస్కే బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా పట్టుబిగించడంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 15 ఓవర్లలో 120-6 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది. మరో 5 ఓవర్లు కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేస్తే సీఎస్కే జట్టు అవలీలగా విజయం సాధించే అవకాశం ఉంది.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/csk.jpg csk, international, ipl final match, KKR, top order loss, trending news 2021-10-15 23:07:34 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/csk.jpg పంజాబ్ పీసీసీ నవజోత్ సిద్ధూదే.. https://www.dishadaily.com/navajyoth-siddu-continue-as-punjab-pcc-president Fri, 15 Oct 2021 17:21:28 +0000 https://www.dishadaily.com/?p=306415 దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత సింగ్ సిద్ధూ కొనసాగుతాడని కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సిద్ధూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన రాజీనామాను సిద్ధూ ఉపసంహరించుకున్నాడని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హరీవ్ రావత్ తెలిపారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సిద్ధూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్‌తో పాటు పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేస్తున్నట్టు సిద్ధూ ప్రకటించారు.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/07/navajyoth.jpg continue, National, navajyoth siddu, punjab pcc president, Rahul gandi 2021-10-15 22:51:28 https://www.dishadaily.com/wp-content/uploads/2021/07/navajyoth.jpg బ్రేకింగ్ : బరితెగించిన టీఆర్ఎస్ లీడర్లు.. దళిత బీజేపీ కౌన్సిలర్‌పై దాడి https://www.dishadaily.com/trs-leaders-attacks-on-bjp-counciler-in-gundla-pochampalli-muncipality Fri, 15 Oct 2021 17:11:29 +0000 https://www.dishadaily.com/?p=306412 దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ 9వ వార్డులో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ప్రతీ దసరాకు కండ్లకోయ గ్రామంలో ప్రజాప్రతినిధి జెండా ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. కండ్లకోయ మున్సిపాలిటీ ఏర్పడటం వల్ల స్థానిక బీజేపీ కౌన్సిలర్ హంసా రాణి కృష్ణ గౌడ్ ఈ సంవత్సరం జెండాను ఆవిష్కరించడంతో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని జెండాను తొలగించారు.దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డిలు కలిసి స్థానికంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే తమ పార్టీ కౌన్సిలర్ జెండా ఎగురవేయకుండా అడ్డుకుని తమపై దాడికి పాల్పడ్డారని బీజేపీ లీడర్లు ఆరోపించారు. అధికార బలం చూసుకుని పోలీసులను తమపై లాఠీచార్జి చేసేలా ఉసిగొల్పారని మండిపడ్డారు. అయితే, తాను దళిత మహిళ కావడం వల్లే దసరా వేడుకల్లో జెండాను ఆవిష్కరించకుండా అడ్డుకుని, దాడి చేశారని కౌన్సిలర్ హంసా రాణి ఆవేదన వ్యక్తంచేశారు.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/trs-leaders-attack.jpg attacks, bjp counciler, gundla pochampalli, medchal, trs leaders 2021-10-15 22:41:29 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/trs-leaders-attack.jpg తెలంగాణలో ఘనంగా రావణ దహనం.. https://www.dishadaily.com/ravana-statues-burning-in-telangana-wide Fri, 15 Oct 2021 16:58:13 +0000 https://www.dishadaily.com/?p=306409 దిశ, వెబ్‌డెస్క్ : దసరా పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఊరూరా, వాడవాడల్లో జమ్మి చెట్టుకు షమీ పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇకపోతే చిన్నాపెద్ద అందరూ కొత్త బట్టలు ధరించి దేవుని ఆశీస్సులతో పాటు కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించుకునే తొలి పండుగ కావడంతో సొంతూర్లకు చేరుకున్న చిన్ననాటి మిత్రులతో కలిసి పల్లె, పట్నం జనం ఘనంగా విజయదశమి వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే వాడవాడలా, గల్లీల్లో, ఊరూరా రావణాసురుడి విగ్రహాలను ఏర్పాటు చేసి దహనం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రావణాసురుడి ప్రతిమల దహన కార్యక్రమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలంతా దహన కార్యక్రమం జరిగే ప్రదేశానికి తరలుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బాణాసంచా కాల్చి ప్రజలు ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నట్టు సమాచారం. కాగా, హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో జరిగిన దసరా వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నట్టు తెలిసింది.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/ravana.jpg burning, central minister kishan reddy, dussera, governer dattatreya, ravana statues, telangana 2021-10-15 22:28:13 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/ravana.jpg IPL : అదరగొట్టిన CSK ఓపెనర్స్.. KKR ఎదుట భారీ లక్ష్యం https://www.dishadaily.com/kkr-target-is-193-given-by-csk Fri, 15 Oct 2021 16:18:57 +0000 https://www.dishadaily.com/?p=306406 దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ -2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు కేకేఆర్ ఎదుట భారీ లక్ష్యాన్ని విధించింది. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే జట్టు 3వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగులు చేస్తే కేకేఆర్ ఐపీఎల్ విజేతగా నిలవనుంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ 32, ఉతప్ప 31 పరుగులు చేసి వెనుదిరగగా.. ఓపెనర్ డుప్లిసిస్ కేవలం 59 బంతుల్లో 86 పరుగులు చేసి చెన్నై జట్టుకు భారీ పరుగులు సాధించిపెట్టాడు. ఇకపోతే మరో ఆటగాడు మోయిన్ అలీ 37 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, మావి ఒక వికెట్ తీసి చెన్నై భారీ జట్టు భారీ పరుగుల వరద పారించకుండా అడ్డుకట్ట వేయగలిగారు.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/dupliciss.jpg CSK and KKR, international, ipl final match, sports, target 193 2021-10-15 21:48:57 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/dupliciss.jpg ఆఫ్ఘన్ రక్తపాతం.. 32కు చేరిన మృతుల సంఖ్య https://www.dishadaily.com/32-members-died-in-afganistan-genocide Fri, 15 Oct 2021 16:04:22 +0000 https://www.dishadaily.com/?p=306403 దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్టనిస్తాన్‌లోని కాందాహార్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 32 మంది అసువులు బాసినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆత్మాహుతి దాడిలో మరో 74 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. శుక్రవారం మసీదులో ప్రార్థన చేస్తుండగా షియా ముస్లీములే టార్గెట్‌గా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/genocide.jpg 32 members, afganistan, Death, genocide, international 2021-10-15 21:34:22 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/genocide.jpg IpL హిస్టరీలోనే సరికొత్త రికార్డు.. https://www.dishadaily.com/csk-player-ruturaj-gaikwad-create-new-history-in-ipl Fri, 15 Oct 2021 15:44:48 +0000 https://www.dishadaily.com/?p=306398 దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయస్సులోనే ఎక్కువ పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు కేఎల్ రాహుల్ (626 పరుగులు) వద్ద ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. 603 పరుగులతో రెండో స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు 24 రన్స్ చేసి రాహుల్ ను అధిగమించాడు. దీంతో 627 సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో గైక్వాడ్ సెంచరీ ఫీట్ కూడా సాధించాడు.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/ruturaj.jpg csk player, final match, higest runs, orenge cap, Ruturaj Gaikwad 2021-10-15 21:14:48 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/ruturaj.jpg మంజీరా మాల్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. https://www.dishadaily.com/person-jumped-from-manjeera-mall Fri, 15 Oct 2021 15:29:36 +0000 https://www.dishadaily.com/?p=306394 దిశ, కూకట్​పల్లి : నగరంలోని కేపీహెచ్​బీ పోలీస్​‌స్టేషన్​ పరిధిలో గల కేపీహెచ్​బీ కాలనీ మంజీరా మాల్​ 18వ అంతస్థుపై నుంచి దూకి శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. మంజీరా త్రినిటి కార్పొరేట్​ కార్యాలయంలో గేట్​ నంబర్​ ఒకటి వద్ద ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు మంజీరా మాల్​ సెక్యూరిటీ సూపర్​ వైజర్​ వాకిటి భూపాల్​ రెడ్డి కంట్రోల్​ రూంనకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కేపీహెచ్​బీ పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సోమర భూపతి రెడ్డి (25)గా గుర్తించారు. మృతుడు 18వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు సీఐ తెలిపారు. మృతుడు భూపతి రెడ్డి 17వ అంతస్థులో గల ఎంఎస్​సీ సర్వీస్​ సెంటర్​లో పని చేస్తున్న ఓ వ్యక్తిని కలవడానికి వచ్చినట్టు తెలిసిందని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ప్రాథమికంగా లభించిన వివరాల ఆధారంగా మృతుడి పేరు మాత్రమే కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.

]]> https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/person-sucide.jpg hyderabad, kukatppalli, manjeeramall, person suicide 2021-10-15 20:59:36 https://www.dishadaily.com/wp-content/uploads/2021/10/person-sucide.jpg