కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

by  |
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: అతని పేరు మొఘల్ ​సత్తార్​బేగ్. రిటైర్డ్ ​ఎంపీడీవో. 70ఏళ్లుంటాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నివాసి. చాలాకాలం పాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి పీఏగా సేవలందించారు. ఇటీవల అతని కుమారుడు షమీ బేగ్​ అనారోగ్యంతో ఒంగోలు రిమ్స్​లో చేరి చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి చనిపోయాడు. ఇదేక్రమంలో కుమారుడి మరణ వార్త విన్న సత్తార్ బేగ్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. షమీకి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒక్కసారిగా తండ్రీ కొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Next Story