పోడు భూములు లాక్కోవద్దు : రైతులు

by  |
Podu lands
X

దిశ,బోథ్ : పల్లె ప్రకృతి వనం పేరుతో పోడు భూములను లాక్కోవద్దని ధన్నూర్ బి గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ శివారులోని 33వ సర్వే నంబర్‌లో 50 ఏళ్లుగా గ్రామానికి చెందిన దళిత, గిరిజనులు పోడు వ్యవసాయాన్ని చేసుకుంటున్నారని తెలిపారు. రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో సాగు పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. ఇదే అదునుగా అధికారులు పల్లె ప్రకృతి వనం పేరిట ఐదు రోజులుగా పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు భూముల మీదకు వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ, రెవెన్యూ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామానికి దూరంగా ఉన్న వ్యవసాయ భూములను పల్లె ప్రకృతి వనానికి కేటాయించడం సరికాదన్నారు. పేదల భూములను లాక్కోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో రెైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు.


Next Story

Most Viewed