అన్నదాతను ముంచిన స‌న్నాలు..!

by  |
అన్నదాతను ముంచిన స‌న్నాలు..!
X

దిశ‌, ఖ‌మ్మం : ప్రభుత్వం నియంత్రిత పంట‌సాగు విధానంలో భాగంగా స‌న్నవడ్లు వేయాల‌ని రైతుల‌ను ప్రోత్సహించింది. వ్యవ‌సాయ శాఖ అధికారులు చెప్పిన వ‌రి ర‌కాలు కాకుండా వేరే ర‌కాలు వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయ‌ద‌నే భ‌యంతో రైతులు భారీగా స‌న్నర‌కం విత్తనాలు వేశారు. జిల్లాలో మొత్తం 2,83713 ఎక‌ రాల్లో వ‌రి పంట వేయగా 2143,993 ఎక‌రాల్లో స‌న్నర‌కం వ‌రి పండించారు. కేవ‌లం 3,972 ఎక‌రాల్లో మాత్రమే దొడ్డుర‌కం వ‌రిని పండించారు.

స‌న్న ర‌క‌మైన సాంబ‌మ‌సూరి, ఆర్ఎన్ఆర్, పూజ‌లు ర‌కాలకు వ‌రికి కాటుక రోగం, దోమ పోటు ఎక్కవ వ‌ చ్చింది. దీంతో రైతులకు పెట్టుబ‌డి పెరిగింది, దిగుబ‌డి త‌గ్గింది. వ్యవ‌సాయ అధికారుల మాట విని స‌న్నాలు వేస్తే నిండా మునిగా మి రైతులు వాపోతున్నారు. అయినా ఇంత క‌ష్టప‌డి తీరా పంట పండించి క‌ల్లాల్లో ఆర‌బెట్టి కొనుగోలు కేంద్రాల‌కు తీసుకువ‌స్తే ఇంకా ఆర‌లేద‌ని తేమ శాతం ఎక్కువ‌గా ఉంద‌ని పూర్తిగా ఆర‌బెట్ట కుని రావాల‌ని ఐకేపీ సిబ్బంది వెన‌క్కి పంపుతున్నారు. దీంతో రై త‌న్నలు నానా అవ‌స్తలు పడుతూ వెనుదిరుగుతున్నారు. కొంత‌ మంది కొనుగోలు కేంద్రాల్లోనే ఆర‌బెట్టకుంటూ 15 రోజులుగా ఎదురుచూస్తున్నారు. త‌రువాత కొన‌మంటే మాకు ఇంకా మిల్లు ఎలాట్ కాలేదు. కాంటా వేసేందుకు గోనె ‌సంచులు రాలేద‌ని, అధికారులు మిల్లు ఎలాట్ చేసిన త‌రువాత కొంటామ‌ని సాగ‌దీస్తున్నార‌ని రైత‌న్నలు వాపోతున్నారు.

స‌గానికి స‌గం కేంద్రాలు ప్రారంభించ‌నేలేదు…

జిల్లా వ్యాప్తంగా 441 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వ నిర్ణయించినా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 170 మాత్రమే ప్రారంభించారు. అందులో స‌గానికిపైగా కేంద్రాల్లో కొనుగోలు జ‌ర‌ గ‌డం లేదు. డీఆర్‌డీఏ, ఐకేపీ నుంచి 67 కేంద్రాలు ఏర్పాటు చే యాల‌ని ప్రతిపాధించినా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 40 మాత్రమే ప్రా రంభించారు. వ్యవ‌సాయ స‌హ‌కార ప్రాథ‌మిక కేంద్రాల ద్వారా 335 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించ‌గా ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 121 కేంద్రాల్లోనే కొనుగోలు జ‌రుపుతున్నారు. డీసీఎంఎస్ నుంచి 50 ఏర్పాటు చేయాల‌ని ప్రతిపాదించ‌గా కేవ‌లం 8, మార్కెట్ క‌మిటీ ద్వారా 9కి 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో స‌గానికి పైగా కేంద్రా ల్లో ఎలాంటి కొనుగోళ్లు జ‌రుప‌డంలేదు. రైతులు నిద్రాగారాలు మాని కొనుగోలు కేంద్రాల్లో ప‌డిగాపులు కాస్తున్నారు.

టార్గెట్ కొండంత‌.. కొనుగోలు గోరంత‌..

జిల్లా వ్యాప్తంగా 56 ల‌క్షలు మొట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించాల‌ని అధికారులు టార్గెట్ పెట్టకున్నారు. కొనుగోలు చేసింది మాత్రం కేవ‌లం 11వేల మెట్రిట్ ట‌న్నులు మాత్రమే. ఒక వైపు రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజులు త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నా కొనుగోలు చేయ‌డ‌కుండా త‌త్సారం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలో కావాల‌నే లేటు చేస్తున్నార‌ని, దీంతో రైతులు ఉండ‌లేక ప్రైవేట్ వ్యక్తుల‌కు అమ్ముకోవాల‌ని చూస్తున్నార‌ని అన్నదాత‌లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మ‌ద్ధతు ధ‌ర ఏ గ్రేడ్‌కు రూ.1888 నిర్ణయించ‌గా బీ గ్రేడ్‌కు రూ.1868 నిర్ణయించింది. ఎంత మంచి పంట తీసుకువ‌చ్చినా బీ గ్రేడ్ కింద‌నే కొం టున్నా ర‌ని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది కూడా ప్రైవేట్ వ్యక్తులు, మిల్లుల వారు పొలం వ‌ద్దకే వ‌చ్చి ప‌చ్చిగున్నా, ఆర‌కు న్నా రూ.1500 నుంచి రూ.1600 వంద‌లు ధ‌ర పెట్టి కొనుగోలు చేస్తున్నార‌ని వారికి అమ్ముకుంటే మేల‌ని రైతులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఎలాంటి ఖ‌ర్చు లేకుండా డ‌బ్బు‌లు చేతిలో ప‌డ‌తాయ‌ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో అమ్మితే డ‌బ్బులు రావ‌డానికి 20 నుంచి 30 రోజ‌లు ప‌డుతుంద‌ని అంటున్నారు.

దిగుబడి తగ్గింది:బాణోత్ శ్రీ‌ను, రైతు, బోటిమీద తండా

నాకు ఎక‌రం భూమి ఉంది. స‌న్నా లు వేయాల‌ని వ్యవ‌సాయ అధికారులు చెబి తే సాంబమ‌సూరి వేశాను. దీంతో రోగా లు ప‌డి పంట‌ స‌‌రిగా పండ‌లేదు. తీరా పొలం కోసే ముందు దోమ‌కాలు పడి పంట తాలైంది. దీంతో దిగుబ‌డి త‌గ్గిం ది. అన్ని క‌ష్టాలు దాటుకుని అమ్ముకునేందుకు కేంద్రానికి వ‌స్తే ఇక్కడ తేమ శాతం ఎక్కువ‌గా ఉంది, ఆర‌బెట్టకుని రావాల‌ని ఐకేపీ సిబ్బంది చెపుతున్నారు. ప‌ది రోజులుగా ప‌డిగాప‌లు కాస్తున్నా. అయినా కాంటా వేయ‌లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలో అర్ధం కావ‌డం లేదు.

ధాన్యం ఆరకముందే తీసుకొస్తున్నారు: కందుల ఉషారాణి, ఐకేపీ, గ్రామ స‌మాఖ్య అధ్యక్షురాలు, కూసుమంచి

రైతులు త‌మ పంట‌ల‌ను పూర్తిగా ఆర‌క ముందే కొనుగోలు కేంద్రాల‌కు తీసుకు వ‌స్తున్నారు. అధికారులు తేమ శాతం 17కు మించ‌కుండా ఉండాలని చెప్పారు. దాని ప్రకార‌మే మేము కొనుగోలు చేస్తున్నాం. రైతులు తీసుకువ‌చ్చే ధాన్యంలో తేమ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే అర‌బెట్టకుని ర‌మ్మని చెపుతున్నాం. రైతులు ఎక్కువ‌గా ఆర‌బెట్టుకుని వ‌స్తే కొనుగోలు కేంద్రంలో ఎదురు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.


Next Story

Most Viewed