ఎమ్మెల్యే వస్తుండని మా ధాన్యాన్ని ఎత్తుతారా.. మీకు ఎవరిచ్చారు ఆ అధికారం..?

135

దిశ, చందుర్తి : సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో సీసీ రోడ్డుపై ఎండబెట్టిన వడ్లను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వస్తున్నారని రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల సాయంతో కుప్పలు పోయించడం ఎంటనీ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గురువారం ఎమ్మెల్యే రమేశ్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ బస్టాండ్ నుంచి ప్రాథమిక పాఠశాల వరకు ఆరబెట్టిన వడ్లను పోలీసుల సహకారంతో గ్రామ పంచాయతీ కార్మికులు కుప్పలుగా పోశారు.

ఈ విషయంపై ముందుగా రైతులకు సమాచారం ఇస్తే ఎవరి ధాన్యాన్ని వారే కుప్పలుగా పోసుకునే వారు కదా అని గ్రామస్తులు మండిపడుతున్నారు. మార్కెట్‌యాడ్ కోసం రైతులు ఎమ్మెల్యేను ఎక్కడ అడ్డుకుంటారో అని ముందు గానే స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసుల సాయంతో ఇలా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే భద్రత కోసం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..