పంటకు అగ్గి తెగులు.. రైతుకు దిగులు

by  |
పంటకు అగ్గి తెగులు.. రైతుకు దిగులు
X

దిశ కరకగూడెం: ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నలకు ఏదో రూపంలో విపత్తు ముంచుకొస్తోంది. తొలుత వర్షాలు లేక దిగాలు చెందిన రైతన్నలు ఆ తర్వాత భారీ వర్షాలతో సతమతమయ్యారు. తాజాగా పలు రకాల తెగుళ్ళు వరి పంటకు సోకడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలో చాలా వరకు రైతులు ఈ ఏడాది వరి పంటను సాగుచేశారు. బర్లగూడెం, తాటిగూడెం, రఘునాథపాలెం, వెంకట్రామపురం, అనంతారం తదితర గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న వరి పంటకు అగ్గితెగులు సోకడంతో రైతులు అనేక రకాల క్రిమిసంహారక మందులు కొడుతున్నారు. అయినా ఫలితం మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీటికి తోడు పలు చోట్ల వరికి మెడవిరుపు, సుడిదోమ తదితర తెగుళ్లు వ్యాపిస్తున్నాయని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు పలు సలహాలు సూచనలు ఇచ్చి తెగుళ్ల భారీ నుండి కాపాడాలి అని కోరుతున్నారు.



Next Story

Most Viewed