26న ‘కిసాన్ పరేడ్’

by  |
26న ‘కిసాన్ పరేడ్’
X

న్యూఢిల్లీ: ఈ నెల 4న జరగబోయే తదుపరి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించుకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ‘కిసాన్ పరేడ్’ నిర్వహిస్తామని తెలిపారు. సాంప్రదాయంగా నిర్వహించే పరేడ్ ముగిసిన తర్వాత మూడు రంగులు అద్దిన ట్రాక్టర్‌లతో కిసాన్ పరేడ్ చేపడతామని చెప్పారు. దేశవ్యాప్తంగా యూనియన్ సంఘాల హెడ్ క్వార్టర్‌లలో నిరసనలు చేపట్టాలని కార్మిక సంఘాలకు పిలుపునిస్తామని అన్నారు. భారత ప్రజల ఔన్నత్యాన్ని గుర్తించే రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవం నాడు ఈ ఆందోళనలు చేపట్టడానికి నిర్ణయించామని వివరించారు.

ఢిల్లీలో ఆందోళనలు మొదలుపెట్టి 26తో రెండు నెలలు నిండనున్నాయనీ పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ మాట్లాడుతూ…‘ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. 5న సుప్రీంకోర్టు విచారణ ఉంటుంది. మా డిమాండ్లకు సర్కారు అంగీకారం తెలుపకుంటే 6వ తేదీనే హర్యానాలో కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తాం. సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న గవర్నర్ నివాసం ఎదుట ధర్నా చేస్తాం. జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్‌లో కిసాన్ పరేడ్ చేపడతాం. ప్రతి ఏడాది సాంప్రదాయంగా నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత మా పరేడ్ ఉంటుంది’ అని వివరించారు.

Next Story

Most Viewed