సీఐ బెదిరింపు.. రైతు ఆత్మహత్యాయత్నం

by  |
సీఐ బెదిరింపు.. రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట రూరల్ సీఐ బెదిరించడంతో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంకు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి పాయిజన్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుని అన్న ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్ రెడ్డి బెదిరించడంతోనే తన తమ్ముడు ఆత్మహత్యకి ప్రయత్నించాడని చెప్పాడు. చిన్నకోడూర్ రూట్‌లో 601/ఆ/1 సర్వే నెంబర్‌లో ఎకరం 25 గుంటల భూమి ఉందని, దీన్ని 21 సంవత్సరాల కింద కొన్నామని చెప్పాడు.

తమ పక్కన ఉన్న రెడ్డి వర్గానికి చెందిన రైతులు తమ భూమిలో నుండి దారి ఇవ్వాలని బెదిరిస్తున్నారని, వారికి రూరల్ సీఐ మద్దతు ఉందని ప్రవీణ్ ఆరోపించాడు. ఈ విషయమై తగాదా జరుగుతుండగా.. తమ తమ్ముడు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడని, వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నాడు. సివిల్ కేసుల్లో రూరల్ సీఐ జోక్యం చేసుకుంటున్నాడని, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని అడగ్గా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తానని, దారికి అడ్డంగా కూసుంటే వాళ్ళ మీది నుండి పోండి, అంతా నేను చూసుకుంటా అని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తమ తమ్మునికి ఏమైనా అయితే ఎంత దూరమైనా పోవడానికైనా సిద్ధమేనని చెప్పాడు.


Next Story

Most Viewed