విషాదం : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి

by  |
విషాదం : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం ఆలస్యం చేస్తోంది. దీని వలన ఎంతో మంది రైతులు కళ్లాలలో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నాయి. అంతే కాకుండా అకాల వర్షాల కారణంగా ధాన్యం తడసిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎంతో శ్రమించి పండించిన పంట నీటి పాలు కావడం, వడ్లను కొనుగోలు చేస్తారో లేదో తెలియక రైతులు ధాన్యం కుప్పల వద్దనే చనిపోతున్న సంఘటనలున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో రైతు రాజయ్య మృతి చెందిన ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story