తహశీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

by  |
తహశీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, నేరేడుచర్ల: మండల కేంద్రమైన గరిడేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. తనకు చెందాల్సిన వ్యవసాయ భూమి.. సోదరుడు రామారావుతో పాటు ముగ్గురు తోబుట్టువుల పేరుమీద ఎలా పట్టా అయిందో తెలియజేయాలని, సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేసుకున్నా.. సమాధానం ఇవ్వడం లేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది అతన్ని అడ్డుకోగా ప్రమాదం తప్పింది.

తహశీల్దార్ వివరణ..

‘కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదం జరుగుతోంది. కాగా రామారావు, తోబుట్టువులు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకే ఈపీపీబీ అనే నిబంధన ప్రకారం పట్టా మార్పిడి చేశాం. ఇందులో ఏ విధమైన అక్రమాలు జరగలేదు. అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రొసిడింగ్ కాపీ జనరేట్ కాలేదు. దీంతో సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరిగింది’. -కార్తీక్, తహశీల్దార్


Next Story