‘సబ్సిడీ ఉన్నా.. ఆ వాహనాలను భరించలేం’

by  |
‘సబ్సిడీ ఉన్నా.. ఆ వాహనాలను భరించలేం’
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ 2 పథకం దేశీయంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడిందని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా చెప్పారు. రానున్న రోజుల్లో ఈ రంగం అభివృద్ధి కోసం ఈ పథకాన్ని మరో మూడు, నాలుగు సంవత్సరాల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకానికి సంబంధించి సబ్సీటీ ఉన్నప్పటికీ ముందస్తు షరతులు, అర్హత ప్రమాణాలు ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలను క్షేత్ర స్థాయి మార్కెట్లోని వినియోగదారులు భరించలేనివిగా ఉన్నాయని ఇటీవల ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలను సమర్థించిన తరుణ్ మెహతా..ఫేమ్ 2 లక్ష్యం కేవలం డిమాండ్ సృష్టించడం కాదు. ఇది వాస్తవానికి సరైన ఉత్పత్తిని సృష్టించడం. ఇది వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తిని నిర్మించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను పునర్నిర్మించేందుకు సహాయపడుతుంది. అందుకోసం దీన్ని మరో మూడు లేదా నాలుగు సంవత్సరాలు అవసరమని’ వెల్లడించారు.

Next Story