ఈటల పేరుతో ఫేక్ లెటర్ కలకలం.. ‘దళిత బంధు‌ బంద్‌కు కుట్రలు’

by  |
ఈటల పేరుతో ఫేక్ లెటర్ కలకలం.. ‘దళిత బంధు‌ బంద్‌కు కుట్రలు’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా ఓ లేఖ వైరల్ అవుతోంది. రూ. 700 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ పార్టీ వివిధ పథకాల పేరిట ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తోందని.. ఈటల సీఈసీకి లెటర్ రాసినట్టుగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 24న సీఈసీకి రాసినట్టుగా ఉన్న లేఖలో.. దళిత బంధుతో పాటు ఇతర పథకాలను ఈటల రాజేందర్ ఆపాలని ఆ లేఖలో కోరినట్టుగా స్పష్టం చేస్తోంది. ఫేక్ లెటర్ సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరో వైపు ఈటల వర్గం కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

ఓటమి భయంతోనే: యెండల

ఈటల గెలుపు ఖాయమని గుర్తించిన టీఆర్‌ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేయడం ఆరంభించిందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ’దిశ‘తో మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా అందరికీ నేరుగా నగదును అందించి.. లబ్ధిదారులకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని.. ఈటల రాజేందర్, బీజేపీ డిమాండ్ చేసిందన్నారు. వద్దని ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. ఇంతకాలం కావాలనే కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేయాలన్న కుట్రతోనే తప్పుడు లేఖలు సృష్టిస్తోందని మండిపడ్డారు. డబుల్ ఇండ్ల మాదిరిగానే దళిత బంధు పథకాన్ని ఎన్నికల తరువాత విస్మరించేందుకు సర్కారు స్కెచ్ వేసిందని యెండల ఆరోపించారు.

Next Story