ఆ ఎమ్మెల్యేకు అర్జెంట్‌గా రూ.15 వేలు కావాలట..!! 

by  |
Feck FB
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖులు, సెలబ్రెటీస్ పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వారి పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. గతంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలను పేరుతో వసూళ్లకు దిగగా.. తాజాగా మరో ఎమ్మెల్యే నేమ్ తో బూరిడీ కొట్టించేందుకు ప్రయత్నించాడో ఘరానా మోసగాడు. ఎమ్మెల్యే అనుచరులు సకాలంలో గుర్తించడంతో ఎవరూ నష్టపోలేదు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతా నుంచి ఆయన సన్నిహితుడికి ఓ మెసేజ్ వచ్చింది. ‘‘తనకు అర్జెంట్ గా రూ.15 వేలు అవసరం ఉన్నది. వెంటనే పంపించు.. మళ్లీ రేపు ఇస్తా’’ అని మెసేజ్ సారాంశం. అయితే ఎమ్మెల్యే ఏంటీ..? రూ.15 వేలు అడగడం ఏందని అనుమానం వచ్చి ఎమ్మెల్యేను సంప్రదించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఎవరో తన పేరుపై నకిలీ అకౌంట్ క్రియోట్ చేశారని ఎస్పీ నయీం అస్మి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎమ్మెల్యే ఆదేశం మేరకు వెంటనే ఫేస్ బుక్ ఛాటింగ్‌ల స్క్రీన్ షాట్ తీసిన పార్టీ వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ముమ్మిడి పవన్ కాకినాడ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

MLA Dwarampudi Chandrasekhar Reddy

Next Story

Most Viewed