ఇకపై రైల్వేలోనూ ఎక్స్‌ప్రెస్ కార్గో సేవలు

by  |
ఇకపై రైల్వేలోనూ ఎక్స్‌ప్రెస్ కార్గో సేవలు
X

దిశ, వెబ్ డెస్క్ : వస్తువు, సరుకు రవాణా సేవల విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న గూడ్స్ రైళ్లకు నిర్ణీత కాలవ్యవధి ఉండకపోవడంతో అవి ఎప్పుడు గమ్యానికి చేరతాయో ఆ రైల్వేకు కూడా తెలియదు. అందువల్లే కార్గోలోనూ ఎక్స్‌ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్’ సేవలను ప్రవేశపెట్టనున్నది. ఆగస్టు 5 నుంచి ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా దీనిని నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు కార్గో ఎక్స్‌ప్రెస్‌తో ప్రయోజనం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. హైదరాబాద్-ఢిల్లీ మధ్య టన్నుకు సగటున రూ. 2,500 కనీస ధరను నిర్ణయించినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వివరించారు. అయితే, ఇది సరుకును బట్టి మారుతుందని, రోడ్డు రవాణాతో పోలిస్తే 40 శాతం తక్కువని తెలిపారు. వివరాల కోసం 97013 71976, 040-27821393 నెంబర్లను కానీ, దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed